ఒకానొక విరహపు పేజీ..

love-hurt

 

ఈ మధ్యంతా నువ్వే

జ్ఞాపకంలా..

పురాతన జానపదంలా..

ఆలోచిస్తూ..నన్ను నేనే మర్చిపోయేంతగా..

ఎన్ని ఏమనుకున్నా..

నీ అహం నిన్ను కదిలించినంతగా..

నా ప్రేమ కదిలించలేదు కదూ..??

ఎన్ని పొడిబారిన రాత్రులు

వేచా నీకోసం..

ఇప్పుడు అలవాటైంది ఆ సౌందర్యం కూడా

యమన్ కల్యాణి లా పలకరిస్తోంది జీవితం..

ఊపిరి పోసుకున్న పాపాయి లాంటి

ఎరికతో…

ముఖారి రాగాల మోహంలో పడలేనిక..

ఇది ఇక అంతే..

గుప్పెడు స్మృతుల గుభాళింపుల

శీతకాలపు చల్లగాలిలా

సున్నితంగా చుట్టుముట్టటం

అలవాటైన ప్రాణానికి..

నీ దాహాల తుఫాను తట్టుకోవటం కష్టమే..

ఎంత ఆత్మీయమైనదైనా …

దేహాన్నిచ్చానేమో గానీ..

నా స్వేచ్ఛ ని నీకు రాసివ్వలేదు..

ఇవ్వలేను కూడా…!!

–సాయి పద్మ

 

[సున్నితమైన బాంధవ్యాలలో, ప్రేమలలో .. అవి విదిలించిన విరహంలో.. చోటు చేసుకున్న అహానికి ఈ కవిత అంకితం..!!]

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

2 Comments Add yours

  1. harish అంటున్నారు:

    chala bagundi. mukyam ga manshi ki freedom kavali. kondaru varni premencham ani banisha ga chustaru. ala kakunda prethi okarki athmabimanam mukyam ani chependi. me e veraha pae

  2. the tree అంటున్నారు:

    బాగుందండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s