అక్షర చర్య…

20090107_0109rape-of-india_w

మాన భంగాలంటే ఉలిక్కిపడటం

మామూలైపోయింది..

తమ తమ మూలాలలోకి తొంగి చూసినప్పుడు

పచ్చిగా ఉన్న మనః గాయాలు

తలచినప్పుడో.. తడిమినప్పుడో

చురుక్కుమనే గత చైతన్యం..

భయాల బిరడాలు వూడదీసుకొని …

సహజమైన… నిజం బయటకి వచ్చినప్పుడో..

త్రుళ్ళిపడటం మామూలైపోయింది..

ఇంతకీ అభి’మానభంగం ఎక్కడ లేదని..

అమ్మ, ఆలి  నుంచీ.. అస్తిత్వాల… అక్షరపు అంచుల దాకా..

పరిశీలిస్తే..అన్నీ ఆచారాల అగచాట్ల ఆనవాలే..

దేవాలయలపై చెక్కిన వొంపుల సొంపుల

సుందరులందరూ ..చింతిస్తున్నారు

మాకు జరిగిన మనో భంగాల మాటేమిటని..

హడావిడిగా బట్టలు కప్పే

శిల్ప నాధుడు లేక..

GangRapeVictimIndiaWomanGrievesForHerDec292012AP_large

అమ్మ:

మ్రుగాళ్ళ  కైనా  ….మగాళ్ళ కైనా జన్మనిచ్చేది తనే..

తను నేర్పని పైశాచికత్వం…

బొడ్డుతాడు తెంచుకున్న పసితనం కాదని..

నడిరోడ్డున విసిరేసిన పైశాచికత్వమని

తెలిసినప్పుడు

జరిగే మనో భంగం…

చిద్రమైన శరీర శకలాలుగా మారి..

మరిగే రక్తం నీరవుతుంది…

నీరసపడిన వ్యవస్థలో…నడుం విరిగిన ఉద్యమమవుతుంది..

Interior_(aka_The_Rape)_1868

 

ఆలి:

కంచాల దగ్గర ఎంగిల్లేరుకునే

అతివకు.. అంతకన్నా ఎక్కువ చోటు..

అనవసరమనుకున్నారో.. ఏమో గానీ

అత్యంత విలువైన.. ఖరీదివ్వక్కరలేని..

వెలలేని పనిమనిషిగా మార్చిన వ్యవస్థలో..

పడగ్గదిలో జరుగుతున్న మానభంగాలకు..

ఉత్తుంగంగా ఎగాసిపడ్డ అసహ్య శృంగాలకు..

లెక్కా పత్రం ఏనాడో మానేశారు..

వస్తువులుగా మారిన మగనాళ్ళు …

అధవా మాట్లాడినా..

మార్కెట్ మాయాజాలం..

“మీ మానభంగానికి మీరే కారణం” అని

మొహం మీదే తలుపేస్తారు 

నాలుగు దినాల ఉద్వేగ ఉద్యమాలతో

నాలుగు తరాల నాణ్యతని నెమ్మదిగా వెనక్కి నెడతారు…

 

nude-bharatmata-mfhussain

 

అస్తిత్వం:

ఎవరికీ అస్తిత్వ భ్రమలెవీ లేవిక్కడ..

ఆడదైనా.. మగైనా..

మానభంగం..మళ్ళీ మళ్ళీ తప్పనిసరి..

ప్రతీ అస్తిత్వానికో రేటు ఉంటుంది..

లేనప్పుడు వేటు పడుతుంది…

విలువలు వలువలు వాళ్ళే ఊదదీసుకొని ..

నగ్న దేహాలతో..

అవనత మేధో శిశ్నాలతో

నిస్తేజంగా తిరుగుతున్నా..

మనస్సు లేని మేదని..

నిత్యం జరుగుతోంది శవ మానభంగం..

 

అక్షరం:

నిత్యం నిన్ను తారుస్తున్నా.. ఎమారుస్తున్నా..

మెదళ్ళతో..ఎంత హింస పడతావంమా

అక్షరమా..

నీక్కూడా .. క్షరం కాని లక్షణం పెట్టి

మానసికంగా ఆడదానిలా మార్చేసాదేమో.. సాహిత్య విధాత

మరే.. అది కూడా  అహంకార మగ లక్షణమేగా..

అక్షరానికి.. లక్షలిచ్చినా.. కోట్లిచ్చినా 

నీకు వెల ఎప్పుడో నిర్ణయించేసాం

మా వ్యాపారంలో.. నీ అర్ధణా వాటా నీది..

ఇప్పుదికైనా.. మనసుల్లోంచి మొదలై…

మెదళ్ళలో ..మేలుకో..

అక్షర వ్యాపారుల.. ఉంపుడు కత్తెవీ 

దిగజారిన విలువల.. చెలికత్తెవీ అయితే..

నీ మానభంగ గాయాలకు..

ఎన్ని గేయాల లేపనాలు సరిపోతాయి??

 

చుట్టూ నిత్యం జరిగే.. మాన భంగాలకు

ప్రతీక.. ఒక భయం లేని పేరు.. నిర్భయ

చుట్టూ దీపాల మధ్య.. సందు సందుల్లో.. కుగ్రామాల్లో..

ఆడ మనసుపై.. శరీరంపై జరిగే చీకటి దాడికి..

కేవలం ఒక ప్రతీక..

ఉదాహరణే  భయంకరంగా ఉంటె..

వ్యవస్థ భయానక తీరు ని ఊహించండి..

ధైర్యాన్ని.. అస్తిత్వాన్ని.. ఆడతనాన్ని.. అక్షర చర్యల్లో.. బ్రతికించండి..

ఇది జీవన్మరణ పోరాటం..

కర్మ కాండ కాదు..

పదో రోజున

గర్భ శోకం.. మాతృ దేవతలకీ..

పిండం..పిత్రుదేవతలకీ

విదల్చటానికి….

2012-12-30T015243Z_3_CBRE8BS1PGA00_RTROPTP_2_CNEWS-US-INDIA-RAPE

–సాయి పద్మ

(రేప్…ఒక సామాజిక రుగ్మత మాత్రమే కాదు. ఒక నిద్ర పోతున్న లేదా నటిస్తున్న వ్యవస్థ వదిలిన అసహ్యానికి ప్రతీక…!! మనకి మనమే వేసుకున్న ఈ కోమా ముసుగుని ఎంత త్వరగా తీసి.. కార్యోన్ముఖులు కాగలిగితే.. అంత రేప్ అనే పదాన్ని చరిత్ర పుటల్లోకి ఎక్కించ గలుగుతాం…!! –సాయి పద్మ )

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s