"మంచి పువ్వు" కాలేని మంచు పువ్వు- కాశీభట్ల వేణుగోపాల్ రచనపై సాయి పద్మ అభిప్రాయం..!!

Manchupuvu cover

కాశీభట్ల వేణుగోపాల్ గారి.. ” మంచు పువ్వు” చదవటం పూర్తి చేసాను ఇప్పుడే. ఒక నిమిషం ఏం రాయాలో తెలీని పరిస్థితి నుంచి తేరుకొని రాస్తున్న రివ్యూ ఇది.

ఇది ఒక అందమైన ఇన్సెస్ట్ స్టొరీ. అందమైన అని ఎందుకంటున్నానంటే.. ఒక తండ్రి. తన  భార్య పోలికలతో పుట్టిన కూతుర్ని కోరుకోవటం అనే అంశాన్ని కూడా, ఇంత అందంగా రాయగలరని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇన్సెస్ట్ అంటే డిక్షనరీ అర్ధం- దగ్గర సంభందీకుల మధ్య సెక్స్ సంబంధాలు, వాటి గురించిన ఆలోచనల వాతావరణాన్ని మొత్తం ఇన్సెస్ట్ అనొచ్చు. ( వికీ డిక్షనరీ కి నా స్వేచ్చానువాదం)

ఇంక మంచు పువ్వు కథలో కొస్తే.. ఒక కాలేజీ లెక్చరర్, అతని చనిపోయిన భార్య కావేరి, బ్రతికి అతని అనురాగంతో పెరుగుతున్న అడాలసెంట్ కూతురు ప్రియ, అతని దగ్గర స్నేహితులు సుబ్బు, వాళ్ళ ఫ్యామిలీ, దుబాయ్ స్నేహితుడు షుకూర్, ఒక పనావిడ, ప్రియ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లికా ( ఈమె మీద కూడా లెక్చరర్ గారికి అంతర్గతంగా కోరిక ఉంటుంది..)

చిన్న పాప ప్రియ, అప్పుడే పదమూడేళ్ళ లోకం చూస్తూ.. కౌమారం లోకి ప్రవేశిస్తుంది. ఆమె ప్యుబర్టీ  రీచ్ అవటం కూడా తన కోరికతో కలిపి మరీ విశదీకరిస్తారు రచయిత. ఈ రచన చదవటానికి ఇబ్బంది కలిగించే ఒక ‘మగ’ నిజం అని చెప్పొచ్చు.

ఇలా ఆ కోరికని తట్టుకోలేని తండ్రి పాత్ర, తన స్నేహితుడు సుబ్బు ఆత్మహత్య చేసుకోగానే చెర్నాకోలు తగిలినట్టు మేల్కొంటుంది.. ఎందుకూ.. ఆత్మహత్యకి కారణం సుబ్బు కూడా ప్రియ మీద కోరిక కలిగి ఉండటం.. ఆమెని ఆవిధమైన కోరికతో, తాకటం అన్నట్టుగా చెప్పకనే సుబ్బు లెటర్ చేత చెప్పిస్తారు రచయిత. దానితో, అతనికి తన కూతురు తనకి ఎందుకు దూరంగా జరుగుతోందో, ఆ పసి మనసు సంఘర్షణ మొత్తం కాకపోయినా కొంత అర్ధం అవుతుంది. వెంటనే, మల్లికా కి పప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా ఎంతో ఆనందంగా అంగీకరిస్తుంది. క్లుప్తంగా కథ ఇది.

చీకట్ల కోణాలను మనసు సెర్చ్ లైట్ తో.. నగ్నంగా చూపించటంలో కాశీభట్ల దిట్ట. నాకు తెలిసినంత వరకూ.. తెలుగులో ఇన్సెస్ట్ మీద కథలు రాలేదు.. ( మీకెవరికైనా తెలిస్తే చెప్పండి.) చలం కొంతవరకూ నిర్లజ్జ కాంక్షా రూపాన్ని అంత సహజంగా చెప్పినా.. ఇన్సెస్ట్ ఏంగిల్ నాకు కనబడలేదు. రచయిత మీద ఉన్న కాఫ్కా  ప్రభావం భలే కనబడింది.

ఈ కథ పూర్తిగా ఒక మగవాడి దృక్పధం తో చెప్పబడింది.. ఒక రచయిత అలా రాయగలిగినందుకు.. సంతోషం కలిగినా.. చిన్నపిల్లలపై అత్యాచారాలు, రక రకాల హింసలు జరుగుతున్న నేపధ్యంలో.. వాళ్ళ మనసు పడే వేదన, అది వాళ్లకి మిగిల్చే పచ్చి నెత్తురు లాంటి జ్ఞాపకం గుర్తొచ్చి బాధేసింది..!!

మంచు పువ్వు వెనుక సాహిత్య ప్రయోజనం కొంత ఉన్నా..నాకు ఎయిడ్స్ ప్రకటనలు గుర్తొచ్చాయి.. ప్రకటనల ఫలితం కన్నా.. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసారు అన్నదే ప్రధానంగా కనబడింది.. అందానికి ప్రాధాన్యత నివ్వని, ఒక మంచితనం రూపు కట్టినట్టు  హీరో కేరక్టర్ తనలోని చీకటితో చేసే యుద్ధ ఘోష బాగా వర్ణించారు.

ఇంత భాషా పటిమ, పాశ్చాత్య సాహిత్యం పై అవగాహన ఉన్న రచయిత.. మంచుపువ్వు లో ఇంకొంచం మంచి ఎక్కువ పెడితే.. చాల మంది పసి మనసులు మంచు ముద్దల్లా మారవన్న నిజం గుర్తొచ్చి ఎక్కడో నిజంగా కలుక్కుమంది. మనం పెంచుకునే మొక్కలు, పిల్లలు కూడా రమణీయంగా తోస్తారు మనకి.. అందంగా..మంచుపువ్వు లానే.. ..రమణీయంగా కనిపించిన వాటితోటల్లా రమించాలనె  కోరిక.. ఒక రాక్షసత్వపు ఆలోచన. అందరికీ మైకం అందేది వస్తుంది. నిత్యం మైకంలో ఉండాలనుకుంటే… ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి. ఆ విషయం రచయిత సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు ఇలాంటి సుప్రెసుడ్  వాంఛలు చాల వరకు కారణం. కనీసం ఈ దిశగా ఒక పరిష్కారం, ఒక నిజాయితీ హీరో కేరక్టర్ చూపించి ఉంటె.. ఈ రచనకి నిజమైన ప్రయోజనం దొరికేది..!!

రచనకి.. ముందు మాట రాస్తూ.. జయప్రభ గారు ఇలా అన్నారు.. ఇలా ఒక రచయిత్రి “మనసు విప్పి” రాయాలని కోరుకుంటున్నాను అని… కానీ నాకనిపించింది.. ఏంటంటే… సహజాతాల కున్న శక్తి, సౌందర్యం అర్ధం చేసుకొనే.. చాల మంది సాహిత్య కారులు.. అసహజమైన, అప్రాక్రుతిక అంశాలపై దృష్టి ఎక్కువ పెట్టలేదేమో…తమ్ముడ్ని పెళ్ళాడిన క్లియో పాత్రా  కూడా.. ఆ పని అడాలసెంట్ ఏజ్ లో చేయలేదు.. ఇదేదో ఆలోచించాల్సిన విషయం నాకు.. మరి మీకు??

చివరగా ఒక్క మాట….

మనిషి లోని చీకటి ని చూసి, అర్ధం చేసుకొని, భరించగలిగే వాళ్లకి.. చావు పెద్ద విషయం కాదు..జీవన సౌందర్యం అనేది మరణం లేదా మరణ సమానమైన కోరికతో ముడి పడి  లేదు.. !!

–సాయి పద్మ

© Sai Padma:IPR // All Rights Reserved.

ప్రకటనలు

One thought on “"మంచి పువ్వు" కాలేని మంచు పువ్వు- కాశీభట్ల వేణుగోపాల్ రచనపై సాయి పద్మ అభిప్రాయం..!!

  1. srinupaindla అంటున్నారు:

    మేడం .. మీ రివ్యూ ఎంటో నాకు అస్సలు అర్ధం కాలేదు. రచనకు ప్రయోజనం దొరికేది లాంటి పెద్ద మాటలకు నాకు అర్ధాలు తెలియవు, కానీ…. మంచుపువ్వు అద్భుతమైన కథ..ఓకే… పెద్ద కధ. కధలో ఇంతకు మించి .. ఎం చేసినా.. దాని అందం పొతుంది. జయప్రభ గారు ముందు మాట రాసింది తపనకు. మంచుపువ్వుకు కాదు. తపన తరువాత మంచుపువ్వు వచ్చింది. కాశీభట్ల పుస్తకాల్ని పరిశీలించాలి. అనుభవించాలి, ఆపై సార్త్ ను కెమూస్ కలిపి చదివి జాయిస్ ఊహల్లో తేలిపోవాలి. కాఫ్కా అర్ధం కాక తన్నుకోవాలి. బీయింగ్ అండక నధింగ్ నెస్ ను జీవితాంతం చదువుతూనే ఉండాలి,.
    వీటన్నింటిపై అవగాహన వచ్చిన తరువాత మళ్లీ మంచుపువ్వు చదవండి .. ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీనుపైండ్ల

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s