కస్టమర్ కేర్ …

2011095530prossy

ఆమె అలా చూస్తూనే ఉంది..

కసరు జాంకాయ  కొరుకుతూ..

పధ్నాలుగేళ్లు ఉంటాయేమో..

చెమ్కీ లు కుట్టిన మాసిన బట్టలు..

పిన్నులు పెట్టిన హవాయి చెప్పులు..

మెళ్ళో నులపల నల్ల కాశీ తాళ్ళు 

బాగా దువ్వి వేసిన రెండు జెళ్లు 

భావాల్లేని కళ్ళు..

child-prostitution-lawisgreek

  అర్ధం కాలేదు.. మిట్ట మధ్యాహ్నం 

ఆ మూలనేం  చేస్తోందో..

వెటకారంగా నవ్వాడు.. 

నేను మనిషనుకున్న నా దోస్త్  మగాడు..

వాళ్ళ వ్యాపారానికి సమయం ఉండదు..

నీకంటూ నియమం లేకపోతే..

అన్నాడు వాడు…

 

“వస్తావా” అన్నా నేను…

మా మామయ్య నడుగు.. చెప్పిందా పిల్ల..

అప్పటిదాకా గమనించని..

చువ్వలాంటి మనిషొకడు.. 

నేపధ్య సంగీతంలో నిశ్శబ్ద జీరలా..

కాళ్లీడ్చుకుంటూ ..

article-2216553-1576C7FF000005DC-547_964x621

నా పెళ్ళామే.. ఎన్ని గంటలుంటారు..?

మొబైల్ ఫోన్లూ.. ఇళ్ళ స్థలాలూ  అమ్ముకునే..

సున్నితత్వంతో.. అంత మృదువుగానూ..

బహుశా…పేదరికం కస్టమర్ కేర్ నేర్పెసిందేమో..

 

” నాకు రేపు పరీక్షుంది.. మావయ్యా..!”

మొదటిసారి అపస్వరం లాంటి 

విహ్వల స్వరంతో.. ఆ అమ్మాయి..

గబా గబా జేబులన్నీ వెతుక్కున్నా..

ఎగశ్వాస దిగశ్వాస లకు ఆక్సిజన్ లా…

తగిలినన్ని పరువాల పచ్చ కాగితాలు 

మార్కెటింగ్ మనిషి చేతిలో పెట్టా..

“నాకేం వద్దు.. ఇవాల్టికి చదువుకొనియ్యి ..!!”

చెప్పా..

భావాల్లేని కళ్ళల్లో మిలమిలల వెలుగు 

భరించే శక్తి లేక..కళ్ళు తిప్పుకుంటూ..

 

మౌనంగా నా దోస్త్ చేయి నా భుజంపై..

ఎదురెండ  కి నా కంట నీరు లేదు.. 

మనసులో ఊరుతున్న తడి ఆరటం  లేదు…!!

 

–సాయి పద్మ

 

© Sai Padma :// All Rights Reserved

ప్రకటనలు

3 thoughts on “కస్టమర్ కేర్ …

  1. Jayashree Naidu అంటున్నారు:

    తేలిక విషయాలో వర్ణనలో అయితే సింప్ల్ లైక్ క్లిక్ సరిపోయేది.. ఇక్కడ ఒక వ్యవస్థ వెక్కిరింపు మానవతా క్షణాల మందహాసం ఒకేసారి కనిపిస్తున్నాయి. ముగింపు చేరే సరికి నా కళ్ళల్లొ నాకే తెలియకుండా నీటి చెలమలొచ్చాయి, మనసు చెమరించింది.

    కవితకి కల్పన ఊతమైతే నువ్వో అద్భుత మానవీయ కోణం ఆవిష్కరించినట్టే
    కాదూ వాస్తవం గా జరిగిందీ అంటే.. ఇది ఒక అవ్యక్త అసహజ పరిస్థితుల్లోంచి పుట్టిన అత్యంత సహజ నిర్మలత్వ జననం.

    యేమైనా… ఈ కవిత కొన్నాళ్ళ వరకూ నా మనసునొదలదురా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s