అభిమాన’భంగం….

2012-10-08-Here_Dragons_lo_zps666243ca

నగ్నపాదాలతో నాలుగు చెరగులా..తిరుగుతున్నా..
నిజాయితీ ఉన్న స్థలం కోసం
నిన్న మాసికలేసిన
ప్రజాస్వామ్యపు జెండా గుడ్డ
ఇవాళ అందంగా ముస్తాబైంది..
విడిపోయే ముందు
అంతా బాగున్నట్టు కనబడ్దానికి

ఒక మానభంగానికి ఒకటి ఫ్రీ
అంటాడొకడు..
మా ప్రజాస్వామ్యం కొనండి..
మేమే దగ్గరుండి రేప్ చేయిస్తాం..
అంటాడు..మరింకొకడు..
అన్నిచోట్లా బంపర్ బొనంజాలే
ఎటు పోవాలో తెలీని గుంజాటనలే

2013-outlawed-in-pakistan

అన్నీ అయిపోయాక చట్టాలు చేయటానికి
చట్రాలు కదుపుతాం మనం.. చుట్టాలతో కలిసి..

నిన్నటి మాసిన ప్రజాస్వామ్యం..
ఊదిపడేసిన కండోం కన్నా హీనం ఇక్కడ..

ఆడా ,మగా, ముసలీ, ముతకా,తేడా లేకుండా..
మరువలేని మానభంగం మామూలే ఇక్కడ..
ఈ తొడతొక్కిడి అసమైక్యంలో అందరూ పావులే ఇక్కడ..

ఎవర్నీ అనవసరంగా శపించకండి ఇక్కడ..
శాపానికి సమైక్య మానభంగం ఎప్పుడో జరిగి..
నెర్రెలు వేసిన మెదళ్ళని వీడి పోయిందేక్కడికో ..
ఎంత విసిగిపోకపోతే..విడాకులడుగుతారు..?

ఆడదానిగా పుట్టావా..అయితే తప్పు నీదే..
అంబేద్కర్ ని చదివావా.. త్వరగా విగ్రహానివైపో..
నీ పేరు వింటేనే.. తీవ్రమైన తీవ్రవాద వాసనేస్తోంది..
మళ్ళీ ఎక్కడా ఎక్కువ మాట్లాడకు..
విశ్వంలో మెచ్చుకుంటే.. విచారించి మరీ వీరతాళ్ళేస్తాం

చెదరిపోయిన దేహ శకలాల్నీ,
స్వైర వీర్య రక్తసిక్తమైన మనసు ముక్కల్నీ..
ప్రోదిచేసి సమైక్య పరిచే వోపిక ఎవరికీ లేదిక్కడ..
అందుకే.. విడిపోదాం.. రండి..పారిపోదాం పదండి..
కొత్త స్నేహాల కోసం.. మర్చిపోయిన విశాలత్వం కోసం
విశృంఖల వేదనామయమైన..
మానభంగాల్లేని వసుధైవక కుటుంబం కోసం…!!!

–సాయి పద్మ

 

© Sai Padma :// All Rights Reserved

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s