(అ)పాశవిక సహజాతాల సముద్ర ఘోష లాంటి ‘తపన’ – కాశీభొట్ల వేణుగోపాల్ నవల పై సాయి పద్మ అభిప్రాయం..

tapan

కాశీభొట్ల వేణుగోపాల్ గారి చిన్న నవల.. తపన చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఎప్పుడో చదువుకున్న ఒక ఇంగ్లీష్  కొటేషన్ గుర్తొచ్చింది. అన్నది ఎవరో గుర్తు లేదు గానీ.. దాని స్వేచ్చానువాదం ఇలా ఉంటుంది.. ” మీకు ఒక పుస్తకం చదవగానే.. ఆ రచయిత మీకు అత్యంత అప్తుదనీ, ఒక ఫ్రెండ్ అనీ, అనిపించి అర్జెంటు గా అతను/ఆమె తో మాట్లాడాలని  అనిపించేంత  ఉద్విగ్నత కలిగిందంటే అది నిస్సందేహంగా మంచి పుస్తకం. కానీ చాలా తక్కువ సార్లు మనకా ఫీల్ కలుగుతుంది..

ఎంత నిజం.. కదూ. ఆ కొటేషన్? తపన చదవగానే నాకు అలానే అనిపించింది. ఒక ఉద్విగ్నత, ఒక మంచుముద్ద  లాంటి నిజాల సంకలనం.. ఒక మనిషి తనలోని పేరుకుపోయిన నిజాల  , సమాజ ఇజాల అసహ్యాలను వాంతి చేసుకోవాలంటే.. చాల ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎంతో ఇంట్రోస్పెక్షన్  జరిగితే గానీ రాదు. ఇలాంటి రచనలకు, ముసుగులు అలవాటైపోయిన సమాజం కూడా అంత సహనంతో తయారై ఉండాలి.

ఇంక కథ క్లుప్తంగా చెప్పాలంటే..  ప్రోటగోనిస్ట్ ఒక వ్యాపారస్తుడు, అందమైన భార్యతో, సామాజిక పరంగా ఏమీ లోటు లేని జీవితం గుడుపుతుంటాడు. పూర్తి ప్రథమ పురుష లో చెప్పబడ్డ ఈ నవలలో.. హీరో కీ అతని భార్య హైమవతి కీ ఉన్న మానసిక యవనిక ఒక ప్రధానాంశం. హీరో కి దగ్గర ఫ్రెండ్ శాస్తుర్లు, భార్య విమల వాళ్ళ చిన్న అందమైన అభిమాన ప్రపంచం. అతని జీవితంలో వచ్చిపోయే స్నేహాలు, గత వాంఛల చిహ్నాలైన రత్నావతి లాంటి ఒకటీ  రెండు కేరక్టర్లు. హైమవతి కి తండ్రి వరసయ్యే  వెంకటనాయుడు. హీరో ఆఫీసు లో పనిచేసే ముకుందం. ఇలా ఒక చిన్న ప్రపంచం. ఎంత ప్రయత్నించినా.. తనకీ తన భార్య కీ మధ్య అంత దూరం ఎందుకుందో అర్ధం కాని తపన లో ఉంటాడు హీరో. కానీ ఎదురు పడగానే శత్రువుల్లా బిహావ్ చేస్తుంటారు ఆ పరిస్తుతుల్లో భార్య కన్సీవ్ అయిందన్న విషయం తెలుస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని వాళ్ళెలా అధిగమించేందుకు ప్రయత్నం చేశారన్నది క్లుప్తంగా కథ.

ఇదే కథని ఒక సింగల్ లైన్ లో కూడా చెప్పొచ్చు. ఇందులో ఉన్నది నిజానికి ఒక ఘోష.. ఒక  నిర్లజ్జ కాంక్ష.. ఒక గతించిపోయి శిధిలమైపోయిన బాల్యపు నీడలు.. బట్టల మడతల్లో దాచుకొని, సమాజభయంతో నగ్నమైన నిజాన్ని, పాశవిక సహజాతాల్ని ఎదుర్కొంటున్న మనిషి వ్యధ.

తపన నవల ఒక చిత్రం..

అప్పడప్పుడు.. రక్తంతో… మరొకప్పుడు చెమటతో

నిజాలు వోప్పుకోలేని అహాల

లయించలేని శరీరాల

ముసుగులేసుకున్న మేధో

చర్మపు ఉపరితలం దాటలేని..

కాంక్షా యవనికల రంగులలో

ముంచి వేసిన అధివాస్తవిక చిత్రం..

హ్మ్మ్…ఇంకేం వర్ణించగలం

యుగళ  గీతమవ్వాలనుకుంటున్న ఒక పోలి కేక.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎంతటి అధివాస్తవిక చిత్రానికైనా. వాస్తవికతే… మూలం, ఆధారం, ప్రాణం, ఆలంబన..!! కవితాత్మకంగా చెప్పిన ప్రతీ వ్యధా సమాజానికి ఒక సందేశం..!!

” Behind the most surrealistic thing.. the impact of reality is everything… basis and as well genesis..!!”

—   సాయి పద్మ

 

Sai Padma IPR:// All Rights Reserved

ప్రకటనలు

2 thoughts on “(అ)పాశవిక సహజాతాల సముద్ర ఘోష లాంటి ‘తపన’ – కాశీభొట్ల వేణుగోపాల్ నవల పై సాయి పద్మ అభిప్రాయం..

 1. సుజాత అంటున్నారు:

  ఎంతటి అధివాస్తవిక చిత్రానికైనా. వాస్తవికతే… మూలం, ఆధారం, ప్రాణం, ఆలంబన..!! _________________ అవును.

  కానీ రెండు మనసుల మధ్య దూరం, అందులోనూ మానసికంగా దూరం ఒకసారి ఏర్పడ్డాక దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు ఎవరిని వారు నమ్మించుకోడానికి చేసే ప్రయత్నాలే తప్ప అవి నిజంగా సినిమాల్లో లాగా సమసి పోతాయా? సమసినా అవి తాత్కాలికమే తప్ప, మళ్ళీ ఆ దూరం తలెత్తదని హామీ ఉందా? అందుకే ఇలా And..they lived happily ever after….ముగింపులు అర్థం కావు! అందులో నిజమెంత అని వెదకాలనిపిస్తుంది.

  ఈ నవల్లో కూడా ముగింపు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు.(అధివాస్తవిక నవల అయినా కూడా)

  • తమ్మి మొగ్గలు అంటున్నారు:

   మీరన్న దానితో నేను కూడా వొప్పుకుంటాను సుజాత గారూ.. మొదట చదవగానే.. ఆ యుటోపియన్ ముగింపు నాకూ అంత నచ్చలేదు. కానీ.. ఆలోచిస్తే.. ఆబ్స్ట్రాక్ట్ నుంచి రియాలిటీ కనెక్ట్ ఒక ప్రయత్నం మాత్రమే.. అనిపించింది.. చాలా కుటుంబాల్లో పిల్లలు లేదా Possibility of children ఒక సేఫ్టీ రూట్ సమాజంతో కలవటానికి చేసే ప్రయత్నం… అంతే.. అదే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేసారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s