అ’ఖండిత … !!

01__amputation_by_saccharinestrychnine-d58md5n

ఎవరన్నారు నువ్వు ఖండిత వని..
నిలువెత్తు చైతన్యం నువ్వు..
అపహాస్యపు లోకం చూపుల్లో చిక్కని
ధీరత్వపు హాసం నువ్వు

నీలోని కణాలు నిర్జీవులైనా నువ్వు నవ్వుతూనే ఉంటావు
అన్నీ ఉండి హృదయం లేని అభాగ్యులను
చూసి పరిహసిస్తూ
వాళ్ళ నిర్హేతుక నిస్సుగ్గు భయాలను చూసి అసహ్యిస్తూ

నువ్వు తిలోత్తమవీ కాదు…
ఏ కొలతలకీ విలోమానివీ కాదు..
ఖండింపబడిన మానవివి అంతే..
అంగాంగ వర్ణనల లక్ష్యానికీ
పట్టించుకోని సమాజ నిర్లక్ష్యానికీ
కుటుంబాల్లోని అనాధతనానికీ
నువ్వొక ప్రతీకవి..
రంభోరువుల సౌందర్యాలు వర్ణించేవాళ్లకు
నీ ఖండనాంగాల రక్తపు వేదన అక్కర్లెదు..
ఆడ శరీరానికి, వొంపుసొంపుల
వన్నెలుంటేనే వెన్నలమ్మవని
తలిచేవాళ్లకి
తెల్లారిపోయిన
నీ మేధో చిద్విలాస మహిమ అర్ధం కాదు…

TML20110928_KFV
తెగి ముక్కలైన నీ శరీరాన్నీ చూసి
అది నీ వోటమని మురిసే వాళ్ళని
చూస్తే…
జాలేస్తుంది నాకు…
నీ భయం ముగిసిన చోటూ
నీకు జయం కలిగిన మాటూ
వాళ్ళ కరుణ నిండిన మూట
మోయలేని తరుణం ఇదే కదా..

నిజంగా ఎంతటి స్వేచ్చ… సంపూర్ణం అనిపించుకోకపోవటం??

–సాయి పద్మ
( అంప్యుటేషన్ కి గురి అయి..శరీరం ఖండితమైనా… చెక్కు చెదరని మనసుతో, తమ సంపూర్ణత్వంతో నన్ను ఉత్తేజ పరిచిన స్న్హేహితురాళ్ళకు అంకితం..

)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s