మునెమ్మ: ఒక కాంప్లెక్స్ మేనేజీమేంట్ పాఠం.. !!

Munemma

డాక్టర్ కేశవ రెడ్డి రాసిన పాత మునెమ్మ ని  ( పాతది అంటే చాల మంది చదివేసింది. 2007 లో వచ్చింది ) నేను కొత్తగా చదవటం జరిగింది. చిన్నప్పుడు విఠలాచార్య కత్తి యుద్దాల సినిమాలు చూస్తూ, ఎప్పుడూ కాంతా రావు ..యెన్తీవొడె నా .. ఆడవాళ్ళు కత్తి పట్టి చక చక పగ తీర్చేసుకొని, రాజ్యాన్ని, భర్త ( లేదా ప్రియుడు ) ని రక్షించేసుకొని.. అందర్నీ వోడించేసి, వాళ్ళు గెలిచే సినిమాలు వస్తే బాగుండును అనుకునే దాన్ని. తొంభై అయిదు పేజీల చిన్న నవల మునెమ్మ ఆ కోరిక తీర్చేసింది. మునెమ్మ, ఆరాధకుడు మరియు అస్సిస్తేంట్ అయిన సినబ్బ, మునెమ్మ భర్త జయరాముడు మరణాన్ని శంకిస్తూ, కారణాలు కనుక్కుంటూ చేసే ప్రయాణం ఏ పురాణపు కాశీ మజిలీ కథలకూ, మనకంతు దొరకని అపరాధ పరిశోధనా కధలకూ ఏ మాత్రం వాసి తగ్గని అపురూపమైన కదా కథనంతో సాగి పోతుంది. సరిగ్గా చెప్పాలంటే ఆ విధంగా రాసేరు కేశవ  రెడ్డి గారు.

మునెమ్మ గురించి విస్త్రుతమైన చర్చ జరిగింది. ఇంకా జరుగుతూ ఉంటుంది కూడా, అందుకే నేను పూర్తి కథ ఇక్కడ చెప్పాలనుకోవటం లెదు. కథ, విమర్శల తో కూడిన విస్తారమైన వ్యాసం సుజాత  బెడదకోట  గారు రాసింది మీరిక్కడ చదవొచ్చు. http://vaakili.com/patrika/?p=1405

సుజాత గారు అన్నట్టు మునెమ్మ అంత మిస్టీరియస్ గా నాకు అనిపించలెదు. ఎందుకంటె, తమ తెలివినీ, శక్తినీ అండర్ ప్లే చేయటం ( రక రకాల కారణాల వలన ) గ్రామీణ జీవితంలో నిత్యం చూస్తూ ఉంటాను నెను. అసలు వాళ్ళ తెలివి తేటల ముందు ఎవరూ పనికిరారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ తెలివితేట లెవీ కుటుంబాల్లో ప్రదర్శించటం చాల తక్కువ. చీకట్లోంచి వెలుగు ప్రస్థానం లో .. మధ్యలో నీడ అనేది ఉన్నట్టు, చాలా మంది అందులోనే ఉంటారు.

మునెమ్మ మిస్టీరియస్ కంటా  కాంప్లెక్స్ మెంటాలిటీ కనిపించింది నాకు. మునెమ్మ లో నన్ను ఉత్సాహ పరచినవీ, నిరుత్సాహ పరచినవీ మాత్రమే నేనిక్కడ ప్రస్తావిస్తున్నాను. ఒక ఆరోగ్యకరమైన చర్చ కోరుతూ..

మునెమ్మ – ఉత్సాహ పరిచే అంశాలు:

 • మునెమ్మ కొటేషన్స్ – దీనిమీదో పుస్తకం రాయొచ్చు. ఏ మేనేజీమేంట్ ఎక్స్పర్ట్ కూడా చెప్పలేనంత ప్రాక్టికల్ నాలెడ్జీ ని రంగరించి మునెమ్మ ని తయారు చేసారు రచయిత. ఉదాహరణకి ” ఈ మాదిరిగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు రెండు రకాలురా  సినబ్బా . మొదటి రకమేమో నేల  మీద నడిచే నల్ల చీమకు కూడా హాని తలపెట్టారు దేవుని భయంతో . రెండో రకమేమో దేవుని పేరు చెపుతూ గుడినీ, గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారు”   ఇంకో ఉదహరణ ” మనం పొయ్యిలో ఆర్పే ముందు పెద్ద పొయ్యి లోనే కాదు మారు పొయ్యి లో కూడా నీళ్ళు పోసి ఆర్పుతాం కదా. అందర్నీ ఒకే గాటన కట్ట కూడదు, అలాగని ఏ విషయాన్నీ / మనిషినీ పూర్తిగా చదవకుండా వదిలి పెట్టకూడదు ”

          మరో మంచి ఉదాహరణ – మనుషుల యవారాలన్నీ అట్టాగే ఉంటాయిరా సినబ్బా .. ఏ యవారమైనా మనకు అర్ధం అయిన దాన్నే పట్టుకొని కూర్చుంటాం. అర్ధం కాని వాటిని పక్కన పెట్టేస్తాం. ఇది కూడా ఒక రాకమైన సోమరితనమే.

హ్మం .. చెప్పా కదా ఇలా కొటేషన్స్ రాసుకుంటూ పోతే అదో బుక్ తయారవుతుంది.

 • మునెమ్మ ధైర్యం: గ్రామీణ స్త్రీల ధైర్యాన్ని, స్థైర్యాన్ని సరికొత్త కోణంలో ఆవిశ్కరించారు. ఏమీ తెలీనట్టు కనబడే ( పెళ్లి టైం లో జయరాముడికి అలాంటి మైల్డ్ మెంటాలిటీ ఉన్న పిల్లే కరక్ట్ అని నిర్ణయించేస్తారు పెళ్లి కుదిర్చిన పెద్దలు ) ఒక స్త్రీ, తన భర్త నీ, అతని చావుకి కారణమైన తరుగులోన్ని వెతుక్కొని వెళ్లి, కారణాన్ని కనుక్కొని, పగ తీర్చుకోవటం నిజంగా స్థిరంగా సాగే విలంబిత్ లయ  .. ( అంబటి సురేంద్ర రాజు గారి రివ్యూ)  ఇది హడావిడి సంగీతం కాదు. శబ్దాన్నే కాదు , నిశ్శబ్దాన్ని, సహకారం లేకపోవటాన్ని కూడా ఎలా వాడుకోవాలో తెలిసిన స్త్రీ మునెమ్మ.
 • మునెమ్మ తెలివితేటల అండర్ ప్లే: ఎక్కడా మునెమ్మ ఆహాప్రదర్శన చెయదు. కార్యం మీద వెళ్ళినప్పుడు ” అన్నా’ అని నోరారా పిలుస్తుంది. తరుగులోని దగ్గర కూడా ఆమె తన ఎమోషన్స్ బయట పెట్టదు . ఎవర్నీ నమ్మదు. ఆ విషయం బయటకు తెలీదు. భర్త కోపానికి అర్ధం తెలుసుకొని బాధ పడుతుందేమో గాని, బొల్లి గిత్త ని అమ్మేస్తానని జయరాముడు అంటే, దానికి అత్త వత్తాసు పాడితే ( విషయం తెలుసుకున్న తరువాత) ఆమె ఎవర్నీ అడ్డుకొదు. కుటుంబాల్లో ఇది సహజం అన్నంత మామూలుగా ఉంటుంది.
 • మునెమ్మ,కార్య దీక్ష,  అపరాధ పరిశోధన : ఇది ఒక భలే విషయం. ఏ టైం లో మొదలెట్టిన పుస్తకం మొత్తం చదువుతాం అంటే అర్ధం, ఏమిటంటే, లింకులు లింకులు గా ఒక్కో రహస్యం ఆమె విడగొట్టే తీరు.  సినబ్బ ఆమెకి ఒక అస్సిస్తేంట్. అతనితో స్వగతంలా మాట్లాడుతూ ఒక్కో విషయం అర్ధం చేసుకుంటూ వెళ్తుంది. పరస (సంత) లో బోల్లిగిత్త ని అమ్మే కాయితం దగ్గర నుంచీ, దారి పొడుగుతా ప్రతీ కంకర రాయి తో, మొహాలకి ముసుగులేసుకొన్న వాళ్ళ తో మాట్లాడిస్తుంది. ఆ రకంగా చివర ముఫై పేజీలు  ఒక దృశ్య కావ్యం.

మునెమ్మ- నిరుత్సాహ పరిచే అంశాలు:

 • భర్త మనస్తత్వం తెలిసీ, గిత్త లైంగికొద్రేకం వల్ల  అతనిలో కలిగే మార్పులు గమనించినా, అది తమ బ్రతుకు ఆధారం అని తెలిసినా, సరి దిద్దే ప్రయత్నం చేయదు. చేయని తప్పుకు శిక్ష అనుభవించే ఆడదాని మనస్తత్వం మునెమ్మ లో మనం సరిగ్గా ఊహించలేం. ఎక్కువగా కన్విన్స్ అవలెం. 
 • బోల్లిగిత్త ను ” పిలగాడు” అని సంబోధించటం వెనుక ఆర్ధిక పరమైన (ఇంకా అదే జీవనాధారం కాబట్టి ) కారణాలున్నాయా, లేక లైంగిక పరమైన శక్తి రూపానివా అన్నది సరిగ్గా లేదు.  అలాంటప్పుడు 1930 లలో జరిగిన కథగా దీన్ని ఊహించలేం. 
 • ముఖ్యంగా బొల్లి గిత్త ని ఎందుకు అమ్ముతున్నారో తెలీదు అని అనటం మనకి అర్ధం కాదు. ఇలాంటి చోట రచయిత కావాలనే మౌనం వహించారని నాకు అనిపిస్తోంది. This is like shadow in her personality which can be interpreted the way anyone wants. There is lot of ambiguity in it. 
 • నిగూఢమైన శక్తి గా చిత్రించిన మునెమ్మ, తన వెంట్రుకల దారం వల్ల  భర్త చావు సంభవించింది అని తెలుసుకున్న మునెమ్మ, ఎమోషనల్గా నరకం అనుభవించి తమాయిన్చుకుంటుంది. కానీ, పగ మాత్రమే ఆలోచిస్తుంది, పశు ప్రవృత్తి ని ( తరుగులోని లో )  ప్రేరేపించి వికృతమైన రీతిలో బొల్లి గిత్త ద్వారా పగ తీర్చుకుంటుంది. ఇది పొయెటిక్  జస్టిస్ అనటం కంటే పాశవిక జస్టిస్ అనొచ్చు. పగ తీర్చుకోవటానికి రక రకాల మార్గాలు ( ఉదాహరణ మందులోని  చావు ) ఉండగా, ఆమె ద్వారా రచయిత చెప్పదలచుకున్నది ఇంత హింసా అన్నది బాధ వేస్తుంది. 
 • సమకాలీన మహిళ మనస్తత్వం (లేదా పురాతన కాలం మహిళ  అయినా ) ఇంత పాశవికంగా ఉందని నేను అనుకోవటం లెదు. అదీ శక్తి, యుక్తి, ధైర్యం, నిజమైన తెలివితేటలు ఉన్న మునెమ్మ లాంటి వ్యక్తి.  
 • క్రైసిస్ లో సినబ్బ గురించి గాని, తన గురించి గాని, అత్త సాయమ్మ గురించి గాని ఆలోచించదు . తను, తన పగ అంతే. అది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. 
 • మహిళగా పగ తీర్చుకోవటం గురించి చెప్పారా, మనిషిగానా అన్నది ఒక ప్రశ్న్. తన దీనత్వాన్ని, ఆడ మనసునీ ఆర్ద్రంగా పూటకూళ్ళ ముసలాళ్ళకి కూడా ఎస్తాబ్లిష్ చేయగలిగిన మునెమ్మ, పగ దగ్గరకి వచ్చేసరికి పురుషుని కన్నా ఒక మెట్టు ఎక్కువ ఎత్తులో, అత్యంత భయంకరమైన రీతిలో పగ తీర్చుకుంటుంది. 
 • అది కూడా చాల సహజం అన్నట్టు మరలా తన రోజువారీ పనుల్లో (ఇప్పుడు సంపాదన భారం కూడా మోస్తూ…  అవసరం అన్నీ నేర్పుతుంది అని చెప్తూ ) ములిగి పోతుంది. 
 • విచక్షణ లేని పశుత్వం దేనికీ సమాధానం కాదు. మునెమ్మ లాంటి పవర్ ఫుల్ వ్యక్తులు దాన్ని ఎండార్స్ చేయకూడదు.

అదండీ సంగతి… మొత్తానికి మునెమ్మ, అర్ధం చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత. కొన్ని కొన్ని విషయాలు, అంశాలు, మునెమ్మ బలాలపై దృష్టి పెట్టి, పాత్ర లోని బలహీనతలు, అంబీగ్యుటీ సవరించుకోగలిగితే.. ఫూలన్ దేవి లా కాక, పోజిటివ్ శక్తి స్వరూపం మునెమ్మ అనటంలో సందేహం లేదు. ఉదాహరణకి, తరుగులోన్ని చంపే దృశ్యం. మందులోని  చావు ముందర మునెమ్మ బిహేవియర్… ఇవి కావాలని చర్చకి వదిలేసిన  అంశాలా అనే అనుమానం కూడా అప్పుడప్పుడూ వచ్చి .. ఇప్పుడిప్పుడే బలపడుతోన్దండొయ్.. !! నాక్కూడా మునెమ్మ కాంప్లెక్సిటీ వచ్చేస్తో న్దండోయ్… !!

ఈ మునెమ్మ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు. కినిగే లో కూడా దొరుకుతోందన్డోయ్…చదూకొటానికి  బయలేరండి మరి ..!!

http://kinige.com/kbook.php?id=1318&name=Munemma

–సాయి పద్మ

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

2 thoughts on “మునెమ్మ: ఒక కాంప్లెక్స్ మేనేజీమేంట్ పాఠం.. !!

 1. మణిభూషణ్ అంటున్నారు:

  విశేష చర్చకు దారితీసిన నవలపై మళ్ళీ సుదీర్ఘంగా చర్చించిన శ్రీమతులు సుజాత, సాయి పద్మలకు అభినందనలు. సుజాతగారు, మీరు రచయిత పక్షాన నిలబడి చాలావరకు కాడి మోశారు. అలాగే, కొన్నిచోట్ల రచయిత బాధ్యతనుకూడా గుర్తు చేశారు.

  మొత్తమ్మీద సుజాత, సాయి పద్మలు మరోసారి నవలను చదవాల్సిన అవసరం కల్పించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s