వీణ పొగిలే…

83030-9612070-11

వీణలు తగలబడుతున్నాయి ఇక్కడ

అప్పుడెప్పుడో.. మరెప్పుదొ.. నువ్వో నేనో .. శృతి చేయలేని చాతకానితనానికి గుర్తుగా

ఉక్రోషంగా .. ముహాలు ఎర్రబడుతూ.. కాలంతో పోటీపడుతూ

తగలేట్టేద్దామనుకున్న గుర్తు ..

” శృతి లేనంత మాత్రాన, జీవితాన్నీ కూడా అలాగే తగలేద్దామా  ”

అంటే.. నా ఆవేశానికి పడ్డ మొట్టికాయ మాత్రం

తడుముకుంటే తగిలిందిప్పుడు…!!

 

అపస్వరాల ఆరోహణ ల మెట్లూ.. అవాంఛితాల అవరోహణలూ .. మూర్చనల మొహమాటాలూ 

నువ్వెక్కి దిగేసినంతగా నాకు రావటం లేదు..

నీ జ్ఞాపకం కుంకుడు కాయ పుల్లలా కళ్ళల్లోనే ఉంది

తీయనూ లెను… నీక్కావలసిన వీణలా మారనూ  లేను … !!

 

నీరెండ లో .. ఉదారంగు దుఖం నన్ను అలముకుంటోంది…

నారింజగా మారుద్దామనుకున్నా … నీ కర్మ సిద్ధాంతపు అగ్ని లో .. నా అసహనం కూడా బూడిదవుతోంది..

అవసరానికి మాట్లాడి.. క్షమించలేని తత్వంలో నా అహం ఇంకా రాజుకుంటూనే ఉంది

నీ వీణలా.. నా దుఖాన్ని తగలబెట్టే యత్నం నన్ను ప్రతీ నిమిషం రాజేస్తోంది..

ఇది సామాజికం కూడా… ఎన్ని దేహ వీణలు డస్సి అలసి … ఐఛ్చిక  ప్రాయోపవేశాలు చేసాయో తెలుసుకుంటే ..

ఆవేశం రాక మరేమవుతుంది … ??

 

అయినా తగలేట్టేస్తాను.. నీ అస్తికల్నీ, అస్తిత్వాన్నీ …కానీ కొత్త విశ్వ రాగం కోసం…

నిత్య షరతులు లేని ప్రేమ యోగం కోసం…

ఇక్కడో షరతు … మళ్ళీ

సహజ ప్రేమ సరె.. శ్రమ దోపిడీ సరె..

నీ దేహ శాంతి కోసం.. మరి కొందరి ఆత్మ శాంతి కోసం ….

మోక్ష ద్వారాల వెంబడి పరిగెత్తే మూఢులను  ప్రేమించమనకపోతే

కనీస మానవత్వం లేని మనుషుల్ని క్షమించమనే శిక్ష నాకు విధించకపోతే 

తప్పనిసరిగా … నీ వీణని, నా దుఖాన్నీ కలిపి తగలేస్తా .. నన్ను నమ్ము …!!

veena

–సాయి పద్మ

 

Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

One thought on “వీణ పొగిలే…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s