ద్వంద్వ స్వభావాల సౌందర్యాల సాక్ష్యం- ద్రోహ వృక్షం

Droha Vruksham

డాక్టర్  వీ. చంద్ర శేఖర్ రావు గారి కధా సంకలనం ” ద్రోహ వృక్షం” చదవటం పూర్తి చేసి మూడు వారాలు దాటింది. రోజూ నా భావాలు రాద్దామనుకోవటం, అలోచించి రాయలేను అనుకోవటం జరుగుతోంది. మొత్తానికి ఇవాళ ధైర్యం చేసి రాస్తున్నాను. అకస్మాత్తుగా, ఒక వాక్యం మన ఆలోచనా స్రవంతి ని చిందర వందర చేసేస్తుంది, ఇది కాల మహిమ సరేలే అంటే కాదు ద్రోహ వృక్షం కథల, వచనాల, మెటాఫర్ మహిమ అని తెలిస్తే, సాహిత్యం కి ఉన్న శక్తి కళ్ళముందు కనబడినట్టావుతుంది. అదే నేను అనుభవిస్తున్నది.


ద్వంద్వం, ద్వంద్వ స్వభావాలు, మనిషి తనతో తను చేసే యుద్ధాలని ఎవరైనా మన చేయి పట్టుకెళ్ళి చూపిస్తే ఎలా ఉంటుంది? వొళ్ళు గగుర్పొడుస్తుంది. సరిగ్గా అలాగే అవుతుంది ఈ కథలు చదివితే. ఒక రకంగా చెప్పాలంటే, ఇవన్నీ కవితలే. గాయాల మోహ రుతువులే. మన ద్వంద్వ స్వభావాన్ని అందులో ఉన్న నిజాన్ని కరుణ అనే అద్దంలో మనల్ని మనకు చూపించే ప్రయత్నాలే. మనతో మన యుద్ధానికి మనల్ని సమాయత్త పరిచే పరికరాలే.

ఇందులో నాకు చాలా నచ్చిన కథలు –


మోహ రుతువు

– నిజమైన కళ  రకరకాల ఇజాలలో పడి కొట్టుకొని, మనిషి ఆస్తులున్న ఆస్థిపంజరం గా మారటంలో జరిగిన అసహ్యాల సమాహారం, ఆశయాల సమాధి. ఇక్కడ  భరించలేని కీర్తి కాంక్ష ఒక మెటాఫర్.

కొన్ని చినుకులు కురవాలి

– ప్రేమించిన మనిషిని ఉద్యమానికి పోగొట్టుకొని, ఈ మెటీరియల్ ప్రపంచంలో ఇమడలేని సునీత కధ . మరణం, కన్ఫెషన్ ఇందులో వాడబడిన మెటాఫర్.

ఆమె నలభై ఐదవ పుట్టిన రోజు

– మనుష్య సంభందాలకి కాన్సర్ లా పట్టిన నిర్ప్లిప్తత ఈ కథ. వెనక్కి వెళ్ళలేని, ముందుకు జరగని జీవితాల సమాహారం

ద్రోహ వృక్షం

– మనలో మనం, సమానులం అని చెప్పుకుంటూ, ద్రోహ ప్రేరేపణ తో, నిజాలు తెలిసినా, మనకి మనం చేసుకొనే ద్రోహ సాక్ష్యం ఈ కథ. విక్రమార్క సింహాసనం లా, గద్దె మీద ఉన్నప్పుడు మనిషీ, లేనప్పుడు మనిషీ చేసే మాయా విచిత్రాల హేల . అన్నింటా సమానులైన ఇద్దరు శత్రు స్నేహితులు, రెండు సభలుగా విడిపోయిన నిస్సహాయ సాక్ష్యం.

అద్భుతాలు చేసే మనిషి

– ఈ కథ గురించి, ఆ అద్భుతం చేసే కవి గురించీ రాయాలంటే అదే ఒక వ్యాసం అవుతుంది. ఇది నిన్నటి ఉద్యమాల కవుల నేటి జీవితం. ఇది చదివాక నిజంగా ఒక అద్భుతం కోసం మనం ఎదురు చూస్తాం. ఇది ఒక ఎలిజీ లాంటి కధ.

అతను, అతనిలాంటి మరొకరు-

విధార్ధి ఉద్యమాలకు అర్పించిన నివాళి. It’s a true elegy

హంసల రెక్కలు-

ఒక పురాతన  స్వేచ్చా గీతం, చేసిన చివరి ఇష్టమైన ప్రయత్నం, తనని, తన స్నేహితులనూ కలుసుకోవటం.
ఇది కేవలం ఒక మచ్చు మాత్రమే, ఈ నిర్లిప్త ప్రపంచంలో, మనం ఏమిటి ? అని మనం తలపోసినప్పుడల్లా, మనకి దొరికే సాహిత్య సాక్ష్యాలు , ఈ ద్రోహ వృక్ష ఫలాలు.

టీవీ 9 బుక్ పాయింట్ లో మాట్లాడుతూ, చంద్ర శేఖర్ గారు, సాహిత్యం తనకు ఒక అక్సిడెంటల్ గా జరిగిన మిరాకిల్ అన్నారు. నిజమే, జీవితాన్ని మలుపు తిప్పే ఆక్సిడెంట్ లోంచే, నిజమైన కలలు నిండిన ప్రపంచం కోసం మనం ఎదురు చూస్తాం. దానికి అడ్డుపడే పొంచి ఉన్న ద్రోహాలు, అనివార్యమైనా  తెలుసుకోవటం,తిప్పి కొట్టటం కూడా అంతే అవసరమైన జీవన కళ.
ఆ లింక్స్ చూడాలనుకొనే వారి కోసం
పార్ట్ వన్  : http://www.youtube.com/watch?v=2I4QvIICPPo

పార్ట్ టూ : http://www.youtube.com/watch?v=84T83C4QnZg

మనిషితనం గురించి తపన పడే, ప్రతీ మనిషీ చదవాల్సిన కధలివి. మనల్ని మళ్ళీ కలల  వైపు ప్రేరేపించే బలమైన సాధనాలు. 
ఇందులో ముందుపేజీలో మూడు లైన్ల కవిత్వం ఉంటుంది

I Become a Kind of Cannibal Of Reality
I have to go through the Catharsis of Work
I like a kind of permanent double Life.
— Mario Vargas Llosa

Echoing the Same Sentiments with the Enlightenment of This Anthology, I would rather say..

Deception & Double Life.. Enables a Lowest Ebb on Dreams
Highest on Manipulation… The Humanity, are tired of Deception in Every Sphere..
They are left with no other option than…
Dream.. Of Freedom & Peace
They Will Dream.. They Will Dream
— Sai Padma

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

One thought on “ద్వంద్వ స్వభావాల సౌందర్యాల సాక్ష్యం- ద్రోహ వృక్షం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s