అపరిచితా…

galleryimage04

నేనంటే నీకిష్టమేనా ??

అని అడిగిందో ఆవల తీరాల అపరిచిత స్వరం

ఆదాట్టున తలెత్తి చూసే

అస్తిత్వ స్వరం…

ఇప్పుడిప్పుడే తీగలు బిగించుకుంటూ,

తాళాలూ , మూర్చనలూ

తనకనుగుణంగా వేసేవారిని వెతుక్కుంటూ

రాజకీయ శాస్త్ర సర్వాలంకారంగా,

అణచివేత సుశోభితంగా

హృద్యంగా,

గుండె చెదిరేట్టు, డొక్క  కమిలేట్టు

వేదన నమిలేట్టు , వాదన అదిరేట్టు

తాంబూలం నములుతూ

తమాయించుకుంది అధికార అస్తిత్వ గళం

0612vangogh

” అదేంటి? అలా అనేసేవ్? “

నీ కోసమే కదా ఇవన్నీ ??”

ఈ ఆశల సంగతులూ, ఆకాంక్షల స్వర జతులూ

యతులూ, ప్రాసల గతులూ

వర్గాల వర్ణాల, కులాల, ప్రాంతాల వారీగా

నొక్కబడి, తొక్కబడి

గతి తప్పిన నీ జీవన సంగీతాన్ని

గమనించి, సరి చేసేందుకే కదా ఇదంతా !!”

అప్రతిహత అహం అమాయకత్వంలా

అగుపిస్తూ అడిగింది

అస్తిత్వ స్వరం..

…………………

‘ ఏమిటో చెప్పు త్వరగా

మళ్ళీ మన అస్తిత్వం ప్రమాదంలో ఉంది

వెళ్లి కాపాడాలి ”

” హ్మ్మ్.. అసలు నేనెవరో తెలుసా “

– విసుగ్గా విరాగించింది అపరిచిత స్వరం 

‘ చెప్తే తెలుస్తుంది, కానీ భయపడకు

అన్ని వాదాలకూ వేరే వేరే దుకాణం ఉంది!”

అభయమిస్తూ పలికింది అహంకార అస్తిత్వ స్వరం

” నీ అస్తిత్వం లోని అసలు స్వరాన్ని నేనే

నన్నెందుకు పాడనీయవు??

నా బలాల, బలహీనతల మాలికలను 

నీ  మాట కచ్చేరీ మొహమాటస్వరాలుగా మారుస్తావెందుకు??”

మృదంగ నాదంలా మోగింది అతి కాని అపరిచిత స్వరం

“…………………”

నివ్వెరపాటు నిశ్శబ్దాన్ని

నగారాలా చీల్చింది..  అస్తిత్వ స్వరం

” నీకెప్పుడు అర్ధం అవుతుంది?

ఆకలి కేకలకి అభేరి కావాలి

అణచివేతకి అసావేరి సరే

నిర్లిప్తత కి శహన సాయం కావద్దూ

కాసుకోనేందుకు కదన కుతూహలమన్నా కావద్దా

మూగ వేదనకు ముఖారి మద్దతుండాలి

వర్గమైనా, వాదమైనా, కచేరీకో పద్ధతుంది..!!”

దులిపెసుకొని …

” అస్తిత్వ జ్ఞానమూ .. అసలు వినా

మహా యోగము  కలదె ఓ మనసా ‘ “

కీర్తి కండువా కుచ్చెళ్లు సర్దుకుంటూ

ఆహంకారాభరణంలా  సాగిపోయింది అస్తిత్వ స్వరం

nevermind

—- సముద్రం గంభీర నాట లా  ఘోషిస్తోంది

     ఆకాశం అహిర్ భైరవిలా నిర్మలంగా శ్వాసిస్తోంది

     అస్తిత్వంలో అసలు స్వరం నిజంగానే అపరిచితమై

     సమ్మోహన ముక్తాయింపు సాయంతో

     కీర్తి,కాంక్షల, యుగ సంధుల  సుడిగుండంలో ఆత్మహత్య చేసుకుంది

     ఈ విషయం అస్తిత్వ స్వరానికి చెప్పేరు సుమా..

     అధికార లాంఛనాలతో కాటిదాకా కానడతో మోసుకెల్తుంది

     ఉష్ .. ఉష్ .. ఉష్ !

— సాయి పద్మ

 

© Sai Padma ://IPR All Rights Reserved

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s