ఒక మరణం తర్వాత ..

life-after-death

ఒక మరణం తర్వాత ..

కొన్ని నిట్టూర్పులు .. కొన్ని అలవాట్లు

పక్కన పడేసిన కొన్ని శబ్దాలు

ఎవరికీ తెలీకుండా నిశ్శబ్దం అవుతున్న

కొన్ని ఆలోచనలు ..

 

ఒక మరణం తర్వాత

కొన్ని అయోమయాలు.. చాలా నైరాశ్యాలు

సాధ్యాసాధ్యాల నుండి అస్పష్టంగా

స్వార్థాల నుండి స్పష్టంగా కనబడే

కొన్ని త్రోవలు …

 

ఒక మరణం తర్వాత …

కొన్ని ప్రేమలు .. చాలా అవసరాలు

వస్తుమార్పిడీ నవ్వుల నుండి .. విమిమయ ప్రపంచం నుండీ

దిగంతాల కావల వెలిగే

కొన్ని చేతనలు …

 

మరణం మంచిదే .. శాపగ్రస్తమైన శరీరం కన్నా

మరణం మంచిదే …రుజాగ్రస్తమైన మనసుకన్నా

మంచిదే .. మంచిదే

అమనిషత్వపు అంచులు .. సజీవమై చూసే కన్నా ..!!

IMG_4633–సాయి పద్మ

 

© Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

One thought on “ఒక మరణం తర్వాత ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s