అంటరాని అక్షరం…

1.
అల్లిబిల్లి పాటల్లో, గున్నమావి తోటల్లో
తిరగాల్సిన బాల్యాన్ని, పట్టి బంధించి
ఇరుకిరుకు గదుల్లో, కదలని నీలి చిత్రాన్ని చేసావ్
నువ్వు బజారు పాలు చేసి, బిత్తరపోయిన వాళ్ళ బాల్యం
బిత్తలి కాని అందులోని అమాయకత్వం
నీకెప్పటికీ అంటరానిదే!
2.
వొళ్ళంతా చూపులతో తడుముతూనే
ఖండితా ఖండితాలు లేక్కేస్తున్నావ్
గేదెలకు సుళ్ళూ , మనుషులకు అందచందాలూ
మనసులోనే గుణిస్తూ , పైకి మమ అంటున్నావ్
మొద్దు వారిన నీ మస్తిష్కానికి
ఓ నిసర్గ సౌందర్యం అంటరానిదే కదా!
3.
శషభిషలన్నీ మనసులో పెట్టుకొని
శతమానం కట్టావ్
జమ ఖర్చుల లెక్కల్లో, జీవితాన్ని తోలేస్తున్నావ్
జమాబందు గా, సంసారాన్ని బందెలదొడ్డి చేసావ్
నువ్విడిచెల్లిన శబ్ద కాలుష్యంలో
ఒక నిశ్శబ్ద అంతరంగం నీకు అంటరానిది కాలేదూ!
4.
అప్రకటిత అహాల కిరీటం నెత్తిన పెట్టావ్
ముళ్ళు గుచ్చుకున్నా, నవ్వలేకునా
సంతోషం నటిస్తూనే ఉన్నావ్
నువ్విచ్చిన అవమానాల బరువుల్లో, నొక్కబడి, తోక్కబడి
తొడతొక్కిడి జీవితాన్ని నటిస్తున్న
అందరి ఆనందం నీకు అంటరానిదే కదా!
5.
విరిగిన దేహాల, మసలిన మేధల్లో
ప్రపంచ దళితానికి దప్పికేస్తే రెండు గ్లాసులు
అందులో ఇంకా విదళితానికి రెండు బావులు
చీరిక పీరికలైన నీ దారుల రహదారుల్లో
నినాదాలతో, భంగపడిన దళిత మానంలో
నిజమైన అభిమానం నీకిప్పుడు అంటరానిదైనది సుమా!
6
భుజాలు తడుముకుంటూ, గోరోజనాల స్నానాలు చేస్తూ
కవిత్వమే తామని చెప్పుకుంటూ
భయభయంగా, తొంగి చూస్తూ
తొట్రుపడుతూ, నంగి నంగిగా
కవిత్వాన్ని కాదు కదా, అక్షరాన్ని అంటుకోలేక పోతున్నవ్
నిన్నంటుకోని అక్షరానికి నువ్వెపుడూ అంటరాని వాడివే!
ఇన్ని అంటరానితనాలు మనస్సులో పెట్టుకొని
కవిత్వ దేహాన్నని, స్తుతించుకుంటూ
కవిత్వంతో దప్పిక తీర్చుకోవటానికి
మడి కట్టుకోమనే మనిషిని చూసి, విసిగి
అక్షరమే తన చుట్టూ, దడి కట్టేసుకుంది,
మనిషిని శాశ్వతంగా విశ్వజనీనతకు
అంటరానివాడ్ని చేస్తూ …!!
–సాయి పద్మ

( “విశాలాక్షి” పత్రికలో ప్రచురితం )

ప్రకటనలు

One thought on “అంటరాని అక్షరం…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s