దాలప్ప తీర్ధం’ మీన నానేటి సెప్పేది బావ్ ?

DalappaTeertham

నిన్న మొన్నటి వరకూ బావ్…. చింతకింది శ్రీనివాసరావు బావ్ అంటే వోరో అనుకున్నామ్ మాం .. గానీ.. మాగొప్ప పిలక తిరుగుడు పువ్వని ఈ మయాన్న అతగాడి బుక్ ‘దాలప్ప తీర్ధం’ సదివాక మాసెడ్డగా తెలిసేసిపోనాది. ఏటీ మాట్లు.. సిన్నంతరం..పెద్దంతరం నేకుండా టాకింగ్ సేసేస్తున్నాను అనుకుంతన్నారా ఏటీ… ఏదో , సీకాకులం , ఇజీనారం , మొయిద, నెల్లిమర్ల, చోడారం, గైపీనారం ఇలాగిలాగే ఉన్న మానాంటి మావూలు జనాల గురించే కదండీ .. రాస్సీనాడు .. కూసింత అబ్మానం ఉండదా ఏటీ …? అద్గదీ.. అదీ యమా రైటు నెక్కంటే .. వోప్పేసుకున్నారు కదా .. ఇగ కథల్లోకి ఓ పాలి వేల్లోద్దారి … ఏం !!

దాలప్ప తీర్ధం…కథల సంపుటి లో ఒక కధ పేరు .. మన ఇళ్ళల్లో మురుగు, మన మల మూత్రాలు ఎత్తే వాళ్ళ గురించి చాలా మంది కధకులు చాలానే కధలు రాసేరు. కానీ .. ఈ కధ వేరు అనిపించింది నాకు. ఒక మురుగు ఎత్తేవాడి పేర తీర్ధం వెలవటానికి దారి తీసిన పరిస్థితులు చాలా సరళంగా , కళింగాంధ్ర మాండలికం లో చెప్పుకొని వెళ్ళారు. చాలా మంచి కధల్లాగే .. అనవసరమైన హంగామా ఏమీ లేకుండా .. !!

అలాగే ‘పాలమ్మ ‘ కధ – అందరం ఆలోచిస్తూ ఉంటాం , గుళ్ళల్లో గంగాళాల కొద్దీ వృధా అయ్యే అభిషేకపు పాలని . కానీ కొంతమందే దానికి నిజమైన పరిష్కారాలు కనుక్కోగలరు . పాలమ్మ లాంటి వాళ్ళు . మనచుట్టూ ఉన్న అసలైన సెలబ్రిటీ లు వాళ్ళే ..!!

ఇందులో అన్ని కధలూ.. ఆకట్టుకోనేవే, వాన తీర్పు, రాజుగారి రాయల్ ఎంఫీల్ద్ , చల్దన్నం చోరీ ( దొరలేప్పుడూ దొంగతనాలు చేయర్రా.. చేస్తే గీస్తే కాంట్రాక్టులు చేస్తారు..లేకపోతే రాజకీయాల్లో చేరతారు .. అని గీతోపదేశం చేసే సుగ్గు వరాలు కధ ) చెరుకు పెనం (ఎన్ని వరదల్లోనైనా మనుషుల్ని చెరుకు పెనం వేసి దాటించీ, జీవితాన్ని దాటలేక పోయిన భూషణం కధ) , దిగువస్థాయి బ్రాహ్మర్ల దారిద్ర్యపు కధ ( చిదిమిన మిఠాయి) మహా మహా మడికట్టుకొనే ఇల్లాళ్ళ కంటే మడిగా ఆవకాయకి సాయం చేసే హుస్సేను మావ కధ ( పిండి మిల్లు), భయంకర రోగాలని జలగలతో నయం చేసి , పట్నంలో జలగ డాక్టర్ల చేతికి చిక్కిన ఆరేమ్పీ కధ (జలగల డాక్టరు ) – ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ .. ఎంచదగ్గ మంచి కధే ..!!

ఈ కధా సంపుటి కి ముందు మాట రాస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇలా అంటారు – “చింతకింది శ్రీనివాసరావు చెబుతున్న ఈ కథలు చోడవరానికి, నెల్లిమర్లకీ మధ్యలో కళిగాంధ్ర నడిబొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలు. ఈ కథలకి కులం, మతం, వర్గం లేవు. ఇందులో వాస్తు సిద్ధాంతి పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు మొదలుకొని పాయఖానాలు శుభ్రం చేసే పెంటపాలెం దాలప్ప దాకా అందరూ ఉన్నారు. ఈ కథల్లో కనిపించే జీవితం ఎవరో ఒక సోషియాలజిస్టు ప్రతిపాదించే జీవిత సూత్రాల ప్రకారం నడిచేది కాదు. నిజానికి, ఈ జీవితాన్ని నడిపించే సూత్రాలేమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కొత్త సోషియాలజీకి తలుపులు తెరుస్తుంది.”

ఆయన మాటలతో ఏకీభవిస్తూ నేను ఇలా అనదలిచాను- రావిశాస్త్రి, చాసో, పతంజలి కధల్లో ఉన్న మానవీయ స్పర్శ, ఈ కధల్లో ఉంది అనటంలో సందేహం లేదు . కానీ.. ఒక జర్నలిస్ట్ గా శ్రీనివాస రావు గారికి…మనుషులు, సమూహాలు తమ సామాజిక, సాంస్కృతిక లేమికి, ప్రస్తుతంలో కనుక్కొంటున్న పరిష్కారాలు కూడా పరిచయం ఉండే ఉంటాయి . అవికూడా ఇంకా ఎక్కువ రాయటం , కొత్త సోషియాలజీ కే కాదు .. కొత్త కధల కీ, మరిన్ని జీవితాల మార్పులకీ కూడా దోహదం అవుతుంది .

మరో మాట- కళింగాంధ్ర యాస తో ఎక్కువ పరిచయం లేనివాళ్లకి , పూర్తి కధ ఇదే యాస లో చదవటం ,అందులో అర్ధం కాని పదజాలం (కొన్ని) ఉండటం ..కొంచం ఇబ్బంది కలిగించే విషయం .. !!

ఈ పుస్తకం శ్రీనిజ ప్రచురణలు –

కినిగే లో దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=1824&name=Dalappa+Teertham

మరి నాను ఎలిపోచ్చేత్తాను బావ్.. ఇలగ రాస్సీనని శీను బాబెటంతాడో.. అందుకే కతలు సదివీసి ఒకపాలి ఎటనుకుంతన్నారో చెప్పిద్దురూ .. మాయమ్మ.. మాబావే ..!!

–సాయి పద్మ

© Sai Padma ://IPR All Rights Reserved

ప్రకటనలు

6 thoughts on “దాలప్ప తీర్ధం’ మీన నానేటి సెప్పేది బావ్ ?

  1. vanajavanamali అంటున్నారు:

    చానా బాగా పరిసయం సేసేసారు.మాయమ్మ.. మాబావే .! అచ్చారాల సాచ్చిగా సల్లంగుండాల. 🙂 ఇక ఈ మాండలికం నా వల్ల కాదు 🙂
    ముద్రణ లొ ఎక్కడ దొరుకుతుండో.. చెప్పకూడదూ! చదివేసి తరించిపోదామని ఆశ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s