డొల్ల జీవితాల క్రాస్ సెక్షన్ కధలు -రంగుటద్దాల కిటికీ

image

ఎస్. నారాయణస్వామి రాసిన ‘రంగుటద్దాల కిటికీ’ కధల సంపుటి ఈ మధ్యనే పూర్తి చేసాను. ప్రవాసాంధ్ర రచయతుల ఫై నాకు కాస్త తేలిక భావం వుండేది. తేలికభావం వారి ప్రజ్ఞ మీదకానీ కౌశలం మీదకానీ కాదు, వాళ్ళు రాయకుండా వదిలేసే విషయాలపై ….!! ప్రవాసంలో జీవితాల్ని గడుపుతున్నవారు, వారు అనుభవిస్తున్న రకరకాలయిన అనుభూతుల్ని, అనుభవాలని, వాటిలో ఉన్న గాఢతనీ చేయల్సినంతగా సాహిత్య పరం చేయలేదన్నదే నా ప్రధాన ఆరోపణ. నారాయణస్వామిగారి కధలు చదివిన తర్వాత సవినయంగా, నా అభిప్రాయం తప్పు అని ఒప్పుకోక తప్పదు. అమెరికాంధ్ర జీవితాల్లోని డొల్లతనాన్ని నిష్పాక్షికంగా, ఇంకా చాలా ప్రేమతో చిత్రిస్తూ రాసిన కధలివి.
స్వామిగారి కధలు చదువుతూ వుంటే కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్యాలు గుర్తుకువస్తున్నాయి –“కధ క్రాస్ సెక్షన్ అఫ్ లైఫ్ – ఏ చెట్టు బెరడునో మైక్రోస్కోప్ కింద పెట్టగానే దాని బాక్ గ్రౌండ్ అంతా తెలిసిపోతుంది. అట్లా వుండాలి కధ..!!” ఈ కధల సంపుటిలో ఉన్న చాలా వరకు కధలు కో.కు. గారి ఈ వాక్యాలతో సరిగ్గా అతికినట్టు సరిపోతాయి. ఇదే సమయంలో Arms Length దూరంలో పాత్రలని చూసి కధలో ఎ పాత్ర పట్ల ప్రత్యేకమైన ఇష్టాయిష్టాలు, Value Judgements కనబడవు. కనబడేదల్లా కధాప్రక్రియ మీద అమితమైన ప్రేమ మాత్రమే. దీనికి మంచి ఉదాహరణ ‘ధీర సమీరే,’ ‘కళాకారుడికి కావలసింది,’ ‘చక్కనిచుక్క,’ ‘వీరిగాడి వలస’ – ఇలాంటి కధలు.
ప్రస్తుతం మనం మన మనసులతో మనమే పరాయికరణ యుధ్ధాలు కొనసాగిస్తున్నాము. దేశానికీ దేశానికీ పడదు. ప్రాంతం ప్రాంతానికి పడదు. అలాగే సంస్కృతికి సంస్కృతికి అసలు పొసగదు. ఎంతో చదువుకున్నవాళ్ళు, తెలివైనవాళ్ళు అనుకునే సమూహాలు సాటి మనిషిని సమానంగా చూడడం అనే విషయానికి వచ్చేసరికి ఎంత సంకుచితంగా, స్వార్ధంగా ప్రవర్తిస్తారో ‘తుపాకీ,’ ‘ఇండియన్ వేల్యూస్,’ ‘ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి,’ ‘ఖాండవవనం’ – ఇలాటి కధలు చెప్తాయి.
హాస్యం రెండువైపుల పదునున్న కత్తి లాంటిది. అందునా ఒకళ్ళు నమ్మి ఆచరిస్తున్న, పైగా మూడాచారాలుగా మారిన సున్నితమైన విషయాలకు వ్యంగ్యం, ఆరోగ్యకరమైన హాస్యంతో నగిషీలు చెక్కాలంటే వాక్యంలో గాఢత, క్లుప్తత అవసరం. అవి స్వామిగారి కధల్లో పుష్కలంగా వున్నాయి. దానికి మంచి ఉదాహరణలు ‘నీవేనా నను తలచినది,’ ‘డిటెక్టివ్ నీలూ,’ ‘అత్తగారితో కొత్తకాపురం,’ ‘కూపస్థ మండూకం,’ ‘నిరసన.’
అన్నట్లు ఈ కధల్లో రాంబ్లింగ్స్ కూడా ఉన్నాయండోయ్… మనిషిలోని ఎన్నో psychological కోణాల్ని, నిస్సహాయతని, అణచివేతని. మనోమధనాన్ని చెప్పకనే చెప్పే ఈ అచేతనా వాక్యాల స్వగతం నాకు భలే నచ్చింది. దీనికి మంచి ఉదాహరణలు ‘ఒక తల్లి గొడవ,’ ‘పూర్వజన్మ వాసన,’ ‘ఒక జనవరి శుక్రవారం లోకస్ట్ వాక్ కార్నెర్ లో’ – నిత్యం ట్రాన్స్మిషన్ మోడ్ లో వుండే మనుషుల స్వభావానికి, గ్లోబలైజేషన్ మనుషుల ఫై వదుల్తున్న అయోమయం, ఆందోళనకీ ఈ రంగుటద్దాల కిటికీ మిర్రర్ ఇమేజ్.
ప్రస్తుతానికి out of print లో ఉన్న ఈ పుస్తకం కినిగెలో e book గా దొరుకుతుంది. గ్లోబలైజేషన్ కలలు ప్రపంచ వ్యాప్తంగా కూలుతున్న నేపధ్యంలో ఇలాటి కధలు ఇంకా రావలసిన అవసరం వుంది. కధాప్రక్రియ మీద ఎంతో passion ఉన్న నారాయణస్వామిగారి లాంటి వాళ్ళు కధలు రాయడం తగ్గించడం ఒక అన్యాయకరమైన విషయం. మానవ జీవితంలో positiveness ని నిష్పాక్షికంగా రికార్డ్ చెయ్యగల కధకులు తగ్గితే డార్క్ ఫిక్షన్ కి, Victimization మరియు Negative Fiction కి కొత్త తలుపులు తెరిచినట్లే. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
ఎందుకంటే కావ్యేషు నాటకం రమ్యం అయితే కధేషు జీవానుభవం రమ్యం అని నమ్మే మనుషుల్లో నేను కూడా ఒక దాన్ని కనుక..!!
–సాయి పద్మ

 

Sai Padma :// IPR All Rights Reserved

ప్రకటనలు

2 thoughts on “డొల్ల జీవితాల క్రాస్ సెక్షన్ కధలు -రంగుటద్దాల కిటికీ

  1. కృష్ణ అంటున్నారు:

    అప్పటికి భారతంలో బతుకుతున్నవాళ్ళవి నిండు జీవితాలు, మావేమో డొల్ల జీవితాలు… ఇలాంటి stereotypical మాటలు వ్రాసేవాళ్ళు పేద్ద సమీక్షకులు… సెహబాష్!

    • తమ్మి మొగ్గలు అంటున్నారు:

      డొల్ల జీవితాలు ఒక్క అమెరికా లోనే ఉన్నాయి అన్నట్టు రాయలేదండీ .. నేను సరిగ్గా చదివితే అమెరికా ఆంధ్ర జీవితాల గురించి స్వామి గారు రాసేరు అని చెప్పాను … పెద్ద సమీక్షకురాలిని అని నేను అనుకోవటం లేదు, అనుకోను కూడా .. కానీ మీరు అనుకున్నందుకు , మీ అభిమానానికి థేంక్ యు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s