భావం – ప్రాప్తి

gasp-jindra-noewi

కాస్త వంగి నడు, ఛాతీ కనబడేలా ఆ నడకేంటి

కాళ్ళు బారజాపి అంగలేస్తూ , ఎలా ఉన్నావో తెలుసా ..మగరాయుడిలా

వోద్దిగ్గా కూర్చోలేవూ.. ఆడ పిల్లవు కావూ

వినీ వినీ విసుగేత్తిపోతోంది ప్రాణం

ఎందుకు సిగ్గుపడాలి శరీరం అంటే ..

నరాల, నాడుల, స్పర్శల, అనుభూతుల

శరీరం అంటే ..

నిప్పుల్లాంటి నెప్పుల, మెలికల, ముడతల, బిగుతుల, వదుల్ల

శరీరం అంటే..

ఆశ, నిరాశల, భావాల, ప్రాప్తుల

శరీరం అంటే

వినేవాళ్ళుంటే, ఆచరించేవాళ్ళుంటే

ఎంతసేపు సిగ్గుపడాలో, ఎలా మడుచుకొని పడుకోవాలో

కూడా చెప్తారు, ఏ బట్టలేసుకొని తిరగాలో చెప్పినట్టు

ఎంత ఫ్రెష్ గా నటిస్తే , అంత డిమాండ్ పిల్లా

అనేది మా ఖాదర్ లక్ష్మి

అదే లైసెన్సుడ్ వ్యభిచారాల్లో

తొడల మీద చారలూ, చేసిన అత్యాచారాలూ

అంతే కన్వీనియెంట్గా మానిపోతాయి

మధురవాణులూ , చలాలూ, యెంత గింజుకున్నా

శరీరాలకి వ్యాయామం కాదు కదా ..

శరీరాన్ని ప్రేమించాలని కూడా అనుకోం ..

మళ్ళీ ఎక్కడ వదులై పోతే , వలచినవాడు

వేరే పోతాడని భయం ..

అన్నీ భయం.. అంతా భయం ..!

ఎవరో ఏదో అంటారని, మడతల కొద్దీ గుడ్డల వెనుక

అస్తిత్వాన్ని కప్పేసి అస్థిపంజరంలా మిగిలిపోతాం

ఇంతకీ అస్తిపంజరాలకి భావప్రాప్తి ఉంటుందంటావా ..

సగం పెళ్ళిళ్ళల్లా అది కూడా ఫేక్ ఆర్గాజమేనా ..?

–సాయి పద్మ

© Sai Padma IPR:// All Rights Reserved

ప్రకటనలు

2 Comments Add yours

  1. paresh n doshi అంటున్నారు:

    “అన్నీ భయం.. అంతా భయం ..!

    ఎవరో ఏదో అంటారని, మడతల కొద్దీ గుడ్డల వెనుక

    అస్తిత్వాన్ని కప్పేసి అస్థిపంజరంలా మిగిలిపోతాం”

    ఆ భయాన్ని వదిలి పెడితే అంతా స్వెచ్చే.

    Life celebrate చెసుకొవాలంటే దారిలో వున్న కంకర యెత్తి పారెయ్యాలి.

    Good and striking effort.

  2. samson అంటున్నారు:

    super………keka

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s