అత్తమ్మ అంబేద్కర్ లా ఉంది ..!!

frame_edited

 

ఈ మాట నాది కాదు, వినోదిని గారి కథల్లో ఒక కథ టైటిల్ ఇది ..

ఇవాళ మా అత్తయ్య పోయిన రోజు, ఆమె చెప్పిన చివరి మాట- ఆనంద్ వచ్చేస్తాడు, తలుపులు జాగ్రత్తగా వేసుకో ..నా గురించి బాధ వద్దు ..!

ఆలోచిస్తే, తక్కువకాలంలో ఆమె చెప్పినవి , వొక జీవితకాలానికి సరిపోయినన్ని….

ఉదాహరణకి కొన్ని

నేను:సోనియాగాంధీ పరిపాలిస్తోంది అత్తయ్యా –

అత్తయ్య: అంటే, అమ్మా, బాత్రూంలు కదిగేవాళ్ళు కూడా ఇటలీ నుండే వస్తారా ఇంక ..!

నే:పోనీలెండి అత్తయ్యా, కీర్తి కోసమే కదా వాళ్ళ బాధ ..

అ: ఇదిగో పద్మా, ఏ కాంక్ష అన్నా వయసుతో పాటు తగ్గే అవకాశం ఉంది… కీర్తి కాంక్ష ఉన్నవాళ్ళతో చాలా కష్టం.. వయసు పెరిగే కొద్దీ అది పెరుగుతూ ప్రక్కవాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

నే: మేరేదన్నా మిస్ అయ్యారా అత్తయ్యా

అ: మొగుడ్ని భరించటంలో, పిల్లల్ని పెంచటంలో సగం పైగా ఆడవాళ్ళు జీవితమే మిస్ అవుతారు, అది వదిలేయి గానీ.. అంబేద్కర్ బ్రతికుండి, ఆ వుమన్ బిల్ చట్టం వచ్చేసి ఉంటె బాగుండేది అమ్మాయ్

నే: ఏ స్వేచ్ఛ ముఖ్యం.. అర్దికమా, లైంగికమా, సాంఘిక స్వేచ్ఛ నా

అ: మానసికం. ముందు మేము తక్కువ అనో, వేరే వాళ్ళని ఫాలో అవుదాం అనో కాక మనల్ని మనంగా ప్రేమించుకుంటే వచ్చే స్వేచ్ఛ. మిగిలిపోయిన అన్నం మనమే తిని, మొగుడు తిన్న పళ్ళెం మనసులో తిట్టుకుంటూ తీయకుండా ఉండే స్వేచ్ఛ. ఇష్టం ఉండి ఏదన్నా చేయమను.. అది డ్యూటీ గా చెప్తే విని భయపడని స్వేచ్ఛ ..!

నే: ఆనంద్ లేడు, ఇవాళ కూడా అన్నీ వండాలా అత్తయ్యా ..

అ: ఎమమ్మాయి, ఆయనేమన్నా నీ పొట్ట కూడా కేంప్ కి తీసుకెళ్లాడా .. మనిద్దరం లేమూ

నే: వెనక్కి తిరిగి చూసుకుంటే, మీకేం అనిపిస్తుంది.

అ: అదేంటి పద్మా, అలా అంటావు ? వొకప్పుడు నా పెద్ద కొడుకు, టెన్త్ పాసయి, వొక ఉద్యోగం వస్తే చాలు ఈ కష్టాలు తీరతాయి అనుకున్న నేను, అతన్ని డాక్టర్ని చేసాను. నా కూతురుని ప్రధానోపాధ్యాయురాలిని, ఇక మీ ఆయన్ని, విలువలతో కూడిన వొక సామాజిక కార్యకర్త గా చేసాను. నా ప్రతీ గాయం, అవమానం వాళ్ళకి అవకాశంగా మలిచాను. నాకు బోల్డు హేపీ

నే: వాళ్ళు బాగా చదువుకోవటమేనా మీకు పెద్ద రివార్డ్ ?

అ: కాదు, కాదు.. అగ్రికల్చరల్ సైంటిస్ట్ అయిన నా పెద్ద కోడలు, నన్ను తన ఆఫీసుకి తీసుకెళ్ళి.. అంతమంది ముందు “ నేను ఇంత ప్రశాంతంగా , హాయిగా ఇంత సక్సెస్ఫుల్ గా ఉద్యోగం చేస్తున్నానంటే కారణం.. మా అత్తగారు “ అని చెప్పింది. భలే సిగ్గేసింది పద్మా.. కొంచం గర్వంగా అనిపించింది అనుకో.. ఐదో తరగతి చదివి, పదమూడేళ్ళకి పెళ్లి చేసుకొని పదిహేనుకే బిడ్డ తల్లయిన నాకు ..ఇంకేం కావాలి పద్మా ??

వొక జీవితానుభవం వల్ల కళ్ళు చేమ్మగిల్లటం అంటే ఏమిటో నాకు అర్ధం అయింది..

మా అత్తయ్య నాకు అంబేద్కర్లానే అర్ధం అవుతూ అవుతోంది ..!!

హాయిగా ఉండండి అత్తయ్యా .. !!

మీ

పద్మ , నందు 6facbda5-e679-4055-982b-a814fa05d4cd

 

© Sai Padma:// IPR All Rights Reserved

ప్రకటనలు

3 thoughts on “అత్తమ్మ అంబేద్కర్ లా ఉంది ..!!

  1. సుజాత అంటున్నారు:

    అమ్మ కంటే మంచి అత్తయ్య కదూ! మానసిక స్వేచ్చ ముఖ్యమని. ఎంత చక్కగా చెప్పారో!

    ఇవాల్టికీ నేవు మా ఆయన వూరెళ్తే ” అబ్బ, ఏం వండుదాం లెద్దూ” అని సింపుల్ గా కానిస్తాను. తను ఫలానా వండు అని అడగక పోయినా సరే, తను ఇంట్లో ఉంటే నాలుగు రకాలు వండాలనీ తను లేకపోతే అక్కర్లేదనీ .. ఎంత కండిషనింగ్ మనకు తెలీకుండానే జరిగి పోతుందో కదా!

    వాళ్లతో పాటు మన పొట్ట కూడా కాంప్ కి వెళ్లక్కర్లేదని అత్తయ్య చెప్పే దాకా తోచదు:)

    మంచి అత్తయ్య ! మంచి జ్ఞాపకం పద్మ గారూ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s