అతడు…

Abstract-Art-Media-Watercolor-Title-man-and-water-38-x-48-

అతడు..

తనపై కురుస్తున్న విమర్శల నిప్పుల్ని

మంచు ముద్దల్లా చేత ధరిస్తాడు..

తన మౌనంతో..మాటలతో…

ద్వేష శస్త్రదారులను…నిశ్షక్తులను చేస్తాడు..

అతడు..

కణ కణమునా ధర్మాగ్నితో రగులుతుంటాడు..

కాన రాని విలువల కోసం కరుణతో వేచియుంటాడు..

లౌక్యపు యవనికను అవనతం చేయగల

అప్రాప్త మిత్రత కోసం అర్రులు చాస్తాడు..

అతడు..

అవ్యాజంగా వర్షిస్తున్న మానవత్వంపై..

మనసులోనే మహదానందపడతాడు..

తనని తాను పూర్తిగా అవిష్కరించుకోగల

ఒకే ఒక్క మనసు కోసం పరితపిస్తాడు..

అతడు..

క్రౌర్యపు మాటల కుటిల చూపుల

కపట నాటకాలను..బాణంలా చూపుతో చదివేస్తాడు..

నిర్భేద్యమైన సహజాలంకారంలా

నరనరంలో జీర్ణించుకున్న నటనను చేదిస్తాడు..

అతడు..

తళ తళ మెరిసే మోహపు పొరల..

పౌలుసులను విడిపించే స్నేహానికి పట్టం కడతాడు..

కాంక్షా తీరాల …చెలియలికట్టల ఆవల నున్న

ప్రేమ బంధంతో స్వతంత్రుడవుతాడు …!!!

GAL-PT-004

4 thoughts on “అతడు…

  1. కరణం లుగేంద్ర పిళ్ళై అంటున్నారు:

    మీ కవిత బాగుంది. అయితే మొదటి సగంలో ఉన్నంత రెండో సగంలో అతడి గురించి చెప్పాల్సినంత చెప్పలేదేమోనని అనిపిస్తోంది..
    అతడు నేలరాలే కన్నీటి చుక్కల్ని ప్రోగుచేసి సంతోషాల తీరాల వెంట వాటిని వెలిగించగలడు…

  2. kavi yakoob అంటున్నారు:

    మంచి కవిత.”అతడు నేలరాలే కన్నీటి చుక్కల్ని ప్రోగుచేసి సంతోషాల తీరాల వెంట వాటిని వెలిగించగలడు…”
    “అతడు..

    కణ కణమునా ధర్మాగ్నితో రగులుతుంటాడు..

    కాన రాని విలువల కోసం కరుణతో వేచియుంటాడు..

    లౌక్యపు యవనికను అవనతం చేయగల

    అప్రాప్త మిత్రత కోసం అర్రులు చాస్తాడు..

వ్యాఖ్యానించండి