నాలోని నేను… జమున గారి మనోభావాలు

DSC_0563

జమున మా నాన్నగారి స్నేహితురాలు, మా కుటుంబానికి ఆప్తురాలే కాదు. నా జీవితంలో ఒక మంచి పోజిటివ్ శక్తి ని నింపిన మంచి వ్యక్తి. నిన్న ఒక అభినందన సభకి అటెండ్  అయి, మా ఇంట్లో జరిగిన మా అమ్మ విషాద మరణం గురించి తెలుసుకొని, ఇవాళ నన్ను వోదార్చటానికి వచ్చారు.

ఇరవైయేళ్ళు గా ఆమెతో ఎప్పుడూ ఫోటో కావాలి అనని  నేను.. మీతో ఒక ఫోటో కావాలి అని అడిగితే ఆశ్చర్యంగా చూసారు. ఎందుకు అడిగానంటే.. ఆమె ఈ సుదీర్ఘ ప్రయాణం లాంటి జీవితంలో.. చెప్పినప్పుడు అర్ధం కాకపోయినా.. జీవితం లో అనుభవిస్తున్నప్పుడు తెలిసిన ఆణి  ముత్యాల్లాంటి మాటలు.. నా మనసులో నాటుకుపోయాయి. ఆమె స్థాయి వ్యక్తి, నన్ను వోదార్చినప్పుడు నాలో రేగిన అంతర్మధనం, ప్రేమ, అమ్మ, నేను, జమునా ఆంటీ గడిపిన క్షణాల లోంచి, కొన్ని గుర్తున్నవి.. మీతో పంచుకుందామని..ఇలా..

  • నీలాంటి ధైర్యం గల కూతుర్ని కన్న అమ్మ ఎక్కడికీ పోరు. నీ ప్రతి చర్యలో ఉంటారు. ( ఇవాళ అన్న మాట) 
  • నువ్వు జీవితంలో ఎదగాలంటే… ఆడదాన్ని మనిషిలా చూసే వ్యక్తి ని మాత్రమే నీ సహచరునిగా ఎంచుకో. (సుమారు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు చెప్పినది) 
  • ఆడవాళ్ళ బ్రతుకు, ప్రేమ సున్నితం. ఎంతో కొంత ఆధారపడటం తప్పనిసరి. వీలున్నంత తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఎక్కువ సుఖంగా ఉంటావ్. 
  • ఆడవాళ్ళ డబ్బు మీద ఆశ అందరికీ ఉంటుంది. పరిచయమైన వాళ్లకి కూడా.. నువ్వు ఎంత మోసపోతావో అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు మోసం చేయద్దు. మోసపోవద్దు. 
  • ఒక దశలో నాకెవ్వరూ లేరు. ధైర్యం తప్ప. మళ్ళీ జీవితం మొదలు పెట్టటానికి అదే అసలైన పెట్టుబడి. (మొదటిసారి కలిసినప్పుడు, నాకు పదకొండేళ్ళు) 
  • జీవితం మీద కోరిక సహజం.. అత్యాశ అసహజం. 
  • ప్రేమగా ఉండటం మనకేవ్వరూ నేర్పనక్కరలేదు. కానీ స్పష్టంగా ఉండటం రోజూ నేర్చుకోవలసిందే.. ముఖ్యంగా ఆడవాళ్ళు. 
  • నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి, మోసపోయానని అనుకునేదాన్ని. కానీ జీవితాన్ని, మనుష్యులని చదవక పోవటం వాళ్ళ మోసపోయే తెలివైన వాళ్ళని చూసి, నేనేం కోల్పోలేదని అర్ధం చేసుకున్నాను. 
  • కేవలం  స్త్రీని మాత్రమే శక్తి అంటారు. ఉపయోగించకపోతే ఆ జీవితం వ్యర్ధం. 
  • స్త్రీ లో దైనమిజం మాత్రమే ఆమెని ప్రత్యేకంగా నిలబెట్టేది. అది నాకు చాల ఇష్టం. (తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ని తలచుకుంటూ) 
  • మావారు నన్ను లీడర్ అంటారు. మా విధులను, శక్తులను, బలహీనతలను మేము కరక్ట్ గా అర్ధం చేసుకున్నాం. 
  • ప్రేమకి, కరుణ కి దాసోహం అయ్యే స్త్రీ… అధికారానికి దాసోహం అయితే ప్రమాదం, ఆమెకీ, కుటుంబానికి కూడా

ఈ వయసులో కూడా డొమెస్టిక్ వోయోలేన్స్ కి గురి అయిన కూతుర్ని, మనవడ్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ.. ఆమెకి కావలసిన పోరాట పటిమనీ , ప్రేమనీ పుష్కలంగా అందిస్తున్న, జమునా ఆంటీ, రమణారావు అంకుల్ కి  నిజంగా హాట్స్ ఆఫ్.

(ఇది రాసింది.. ఆంటీ కి నాకు, అనుబంధం వివరించటానికి కాదు. ఆమె చెప్పిన విషయాలు ప్రతీ మహిళకీ , మనిషికీ ఉపయోగ పడేవి కాబట్టి. )

DSC_0562–సాయి పద్మ

 

Sai Padma ://IPR All Rights Reserved

4 thoughts on “నాలోని నేను… జమున గారి మనోభావాలు

  1. Jayashree Naidu అంటున్నారు:

    *ఆడవాళ్ళ బ్రతుకు, ప్రేమ సున్నితం. ఎంతో కొంత ఆధారపడటం తప్పనిసరి. వీలున్నంత తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఎక్కువ సుఖంగా ఉంటావ్. * What an observation!
    జమున గారి గురించి ఒక సినీ తారగా మాత్రమే తెలుసు. ఇక్కడ ఇచ్చిన కొద్ది సమాచారం లోనే ఆమె వ్యక్తిత్వం ఎంతో వున్నతంగా చూపించావు పద్మ. మళ్ళీ మళ్ళీ చదువుతూనే వున్నాను.

Leave a reply to తమ్మి మొగ్గలు స్పందనను రద్దుచేయి